విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ౦లోని అరట్లకోట గ్రామంలో నిరుపేదలకు మేరీభా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంచారు. సంస్థ నిర్వాహకులు డేగల రత్నకుమారి సుమారు 300 మందికి బియ్యం, పప్పులు, నూనెతో పాటు కూరగాయలు పంపిణీ చేశారు.
విశాఖ నగరంలో పేదలకు హరిహరాత్మజం అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ కూరగాయలు పంపిణీ చేసింది. నగరంలోని రైల్వే డీఆర్ఎం కార్యాలయం సమీపంలోని వైర్లెస్ కాలనీ రామాలయం ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని ట్రస్ట్ అధ్యక్షుడు కంచు మూర్తి వెంకటరమణ మూర్తి అన్నారు. ఇప్పటికే 3 సార్లు సరకులు పంచామన్నారు.
ప్రకాశం జిల్లాలో...
ప్రకాశం జిల్లా చీరాలలోని ఐదో వార్డులో 800 కుటుంబాలకు రాష్ట్ర బీసీ సంఘం మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ సూరగాని లక్ష్మి.. నిత్యావసర సరకులు, కూరగాయలు, కోడి గుడ్లు ఇంటింటికీ పంపిణీ చేశారు.
తూర్పుగోదావరి జిల్లాలో...
తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని నిరుపేదలను గుర్తించి స్థానిక వైకాపా కన్వీనర్.. ముదునూరు సతీష్ రాజు నిరుపేదలకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు చేతుల మీదుగా అందజేశారు.
వివిధ ప్రాంతాలకు వెళ్తున్న వలస కార్మికులకు తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానం ఆధ్వర్యంలో ఆహార ప్యాకెట్లు, మజ్జిగ పంపిణీ చేశారు. జాతీయ రహదారిపై సత్యదేవుని నమునాలయం వద్ద శిబిరం ఏర్పాటు చేశారు.
గుంటూరు జిల్లాలో...
గుంటూరు జిల్లా తాళ్ళాయపాలెం శైవ క్షేత్రం ఆధ్వర్యంలో విజయవాడ నగరంలోని పలు ప్రాతాల్లో వలస కూలీలలకు అన్నదానం నిర్వహించారు. నగరానికి చెందిన ఆర్ఎస్ఎస్ నాయకులు శివాజి హాజరయ్యారు. శైవక్షెత్రానికి చెందిన సంచార అన్నవితరణ వాహనం ద్వారా కూలీలు ఉన్న చోటకే వెళ్ళి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
శ్రీకాకుళం జిల్లాలో...
శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం లచ్చయ్యపేట గ్రామంలో లాక్ డౌన్ కారణంగా ఇబ్బందుల పడుతున్న ప్రజలకు వైకాపా నాయకులు సురపు ఉదయకుమార్, వైకాపా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్.. నిత్యావసర సరకులు, కూరగాయలు పంపిణీ చేశారు.
ఇదీ చూడండి: