Differences In TDP: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గ తెలుగుదేశంలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. డిసెంబర్ 1న చంద్రబాబు పర్యటన, బహిరంగ సభ ఏర్పాట్లపై ఆ పార్టీ నేతలు సమావేశమవ్వగా.. మాజీమంత్రి జవహర్‌ను వేదికపైకి పిలవలేదంటూ ఆయన వర్గీయులు ఆందోళనకు దిగారు. పొలిట్‌బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి టుమెన్ కమిటీ సభ్యులు, జవహర్ వర్గీయులు హాజరయ్యారు. ఈ క్రమంలో జవహర్‌ను వేదికపైకి పిలవలేదంటూ ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువర్గాలు మధ్య తోపులాట చోటుచేసుకోవడంపై బుచ్చయ్యచౌదరి మండిపడ్డారు. పార్టీలో క్రమశిక్షణ తప్పితే ఎంతటివారినానై సహించేది లేదని హెచ్చరించారు.
ఇవీ చదవండి: