
కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో దర్శనాలను సోమవారం నుంచి పునః ప్రారంభిస్తున్నట్లు దేవదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. కరోనా కేసుల నేపథ్యంలో ఆగస్టు ఒకటో తేదీ నుండి దర్శనాలు నిలిపివేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దర్శనాలు ప్రారంభిస్తున్నామని ఆలయ కార్యనిర్వహణ అధికారి మధునూరి సత్యనారాయణ రాజు తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు దర్శనాలు ఉంటాయని భక్తులు గ్రహించాలన్నారు.
ఇవీ చదవండి