తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో.. 130 మంది పేద వైశ్యులకు నిత్యావసరాలు అందించారు. బియ్యం, పప్పులు, బెల్లం ఇలా ఒక్కో కుటుంబానికి సుమారు 1100 రూపాయల విలువ గల కిట్లను అందజేశారు. ఈ కష్ట కాలంలో తమకు తోచిన సాయం చేస్తున్నామని.. అందరూ తమవంతు సహాయం చేయాలని దాతలు సూచించారు.
ఇవీ చదవండి.. తణుకులో బంద్ ప్రశాంతం