అల్పపీడన ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు.... తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఇప్పటికీ వరద గుప్పిట్లోనే చిక్కుకుంది. వరదలు రైతులకు పెను నష్టాన్నే మిగిల్చాయి. తాళ్లరేవు, ఐ.పోలవరం, ముమ్మిడివరం, కాట్రేనికోన మండలాల్లో సుమారు 5వేల ఎకరాల్లో వరి నీట మునిగింది. మేజర్, మైనర్ డ్రెయిన్ల ఆధునికీకరణ చేయకపోవడం, ఆక్రమణలకు గురి కావడం వల్ల పొలాల్లోని నీరు బయటకు వచ్చే మార్గం లేకుండాపోయింది. వారం రోజులుగా అవస్థలు పడుతున్నా... పలకరించిన నాయకుడే లేడని రైతులు ఆవేదన చెందుతున్నారు. తమని ఆదుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: