ETV Bharat / state

'పేదలు సాగు చేస్తున్న భూములకు తక్షణమే పట్టాలు ఇవ్వాలి' - సీపీఐ ఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి బుగత బంగార్రాజు

పేదలు సాగు చేస్తున్న భూములకు తక్షణమే పట్టాలు ఇవ్వాలని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ డిమాండ్ చేసింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టింది. వ్యవసాయ చట్టాల పేరుతో ప్రభుత్వాలు రైతులను మోసగిస్తున్నాయని ఆరోపించింది.

cpi demand for Land distribution to poor people
'పేదలు సాగుచేస్తున్న భూములకు తక్షణమే పట్టాలు ఇవ్వాలి'
author img

By

Published : Nov 9, 2020, 8:13 PM IST

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టర్ కార్యాలయం ఎదుట అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సీపీఐ ఎంఎల్ లిబరేషన్ ఆందోళన నిర్వహించింది. పేదలు సాగు చేస్తున్న భూములకు తక్షణమే పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. ఎన్నికల ముందు వైకాపా ప్రభుత్వం ఇచ్చిన హామీలు గాలికొదిలేసిందని సీపీఐ ఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి బుగత బంగార్రాజు విమర్శించారు.

వ్యవసాయ చట్టాల పేరుతో రైతులను మోసగిస్తున్నారని, అసలు ఎక్కడా అభివృద్ధి కార్యక్రమాలు జరగటం లేదని ఆరోపించారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. భూములు సాగుచేస్తున్న పేదలకు పట్టాలు ఇచ్చేవరకూ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

రానున్న కార్తీక మాసం ఉత్సవ నిర్వహణపై అధికారుల చర్చ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.