తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలకు కరోనా పరీక్షలు నిర్వహించారు. జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారు.. లాక్ డౌన్ కారణంగా స్వగ్రామాలకు తిరిగి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా సరిహద్దు ప్రాంతంలో వలస కూలీలను పోలీసులు అడ్డుకుని రావులపాలెంలోని జడ్పీ హైస్కూల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వసతి కల్పించారు. వీరంతా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఒడిశాకు చెందినవారు. 202 మంది గత వారం రోజులుగా ఇక్కడే ఉంటున్నారు. ఉన్నత అధికారుల నుంచి ఆదేశాలు రావడంతో వీరందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఊబలంక వైద్యాధికారి దుర్గా ప్రసాద్ తెలిపారు. వీరి నమూనాలను కాకినాడ జీజీహెచ్ ఆసుపత్రికి పంపిస్తామని రెండు రోజుల అనంతరం ఫలితాలు వస్తాయన్నారు. ఫలితాలు ఆధారంగా నెగిటివ్ వచ్చిన వారందరినీ ఆయా జిల్లాలకు పంపిస్తామని తెలిపారు
ఇదీ చదవండి... ఇక పై తల్లి ఖాతాలోనే ఫీజ్‌రీయింబర్స్‌మెంట్
రావులపాలెంలో వలస కూలీలకు కరోనా పరీక్షలు - corona tests in ravulapalem
తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో వలస కూలీలకు కరోనా పరీక్షలు చేశారు. ఫలితాల అనంతరం నెగటీవ్ వచ్చిన వారిని వారి స్వస్థలాలకు పంపుతామని అధికారులు అంటున్నారు.