ETV Bharat / state

తూర్పుగోదావరి జిల్లాలో కరోనా ఉద్ధృతి - తూర్పు గోదావరి కరోనా కేసుల సంఖ్య వార్తలు

తూర్పుగోదావరి జిల్లాలో కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉంది. వైరస్‌ వ్యాప్తితో వేలాది మంది ఆసుపత్రుల పాలవుతున్నారు. విషమంగా ఉన్నవారు మృత్యువాత పడుతున్నారు. జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 37,146కు చేరింది. వీటిలో 15,872 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ 21,026 మంది కోలుకున్నట్లు అధికారులు తెలిపారు. తాజా 10 మరణాలతో కలిపి జిల్లాలో కరోనాతో ఇప్పటివరకూ 248 మంది మరణించినట్లు రాష్ట్ర కమాండ్‌ కంట్రోల్‌-కొవిడ్‌ విభాగం బులిటెన్​లో వెల్లడించింది.

corona positive cases increasing in east godavari

author img

By

Published : Aug 13, 2020, 10:45 PM IST

తూర్పుగోదావరి జిల్లాలో తాజాగా 1504 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు అధికారుగు విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొన్నారు. వీరిలో 1122 మందిని హోం ఐసోలేషన్‌లో ఉంచారు. తాజాగా 906 మందిని డిశ్ఛార్జి చేశారు. అత్యధికంగా కాకినాడలో 318, రాజమహేంద్రవరంలో 290 చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తుని మండలంలో 123, అమలాపురంలో 74, కాకినాడ గ్రామీణంలో 72, పెద్దాపురం 54, రాజమహేంద్రవరం గ్రామీణంలో 51, జగ్గంపేటలో 45 చొప్పున కేసులు నమోదయ్యాయి.

రావులపాలెం మండలంలో 36, కాజులూరులో 33, మామిడికుదురులో 26, పెదపూడిలో 23, ఉప్పలగుప్తంలో 22, బిక్కవోలు, రామచంద్రపురం మండలాల్లో 21చొప్పున తొండంగి మండలంలో 20 పాజిటివ్‌ కేసులు వెలుగుచూసినట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలోని కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో గురువారం నాటికి 2138 మంది ఉన్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్‌ సత్తిబాబు తెలిపారు. కాకినాడ జేఎన్​టీయూకేలో 863 మంది, బొమ్మూరులో 651 మంది, బోడసకుర్రులో 550 మంది, చింతూరులో 46, రంపచోడవరంలో 28 మంది చొప్పున ఉన్నట్లు వివరించారు. అనుమానిత లక్షణాలతో రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రిలో 281 మంది, కాకినాడ జీజీహెచ్​లో 23 మంది చికిత్స పొందుతున్నారు. బొమ్మూరు క్వారంటైన్‌ కేంద్రంలో 651 మంది ఉన్నారు.

తూర్పుగోదావరి జిల్లాకు కువైట్‌, మస్కట్‌ నుంచి 17 మంది వచ్చినట్లు అధికారులు గుర్తించారు. చెన్నై, హైద్రాబాద్‌ల నుంచి విమాన మార్గంలో 148 మంది వచ్చారు. రైలు మార్గంలో పలు ప్రాంతాల నుంచి 809 మంది జిల్లాకు వచ్చినట్లు వివరించారు.

ఇదీ చదవండి:

కరోనా ఉద్ధృతి.. 24 గంటల్లో 82 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.