తూర్పు గోదావరి జిల్లా.. పి గన్నవరం నియోజకవర్గం రాజుల ఏనుగుపల్లి గ్రామంలో 5 రోజుల క్రితం ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఈ గ్రామంలో ఈనెల 15న వైద్యసిబ్బంది పాజిటివ్ వచ్చిన వారితో సంబంధం ఉన్న 27 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీటి ఫలితాలు బుధవారం వచ్చాయి. ఇందులో 26 మందికి నెగిటివ్ రాగా.. అదే కుటుంబానికి చెందిన మరొకరికి పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారి సుబ్బరాజు తెలిపారు. గ్రామంలో మరిన్ని కరోనా పరీక్షలు చేస్తామని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: చైనా ఆ కారణంతోనే భారత్‌ను రెచ్చగొడుతోందా?