తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కరోనా కేసుల తీవ్రత నానాటికీ పెరుగుతున్న కారణంగా అప్రమత్తంగా ఉండాలని నగర పాలక కమిషనర్ దినకర్ పుండ్కర్ సూచించారు. 50 డివిజన్లు ఉన్న కాకినాడ నగరంలో 54 కంటెయిన్‌మెంట్ జోన్లు ఏర్పాటు చేశామన్నారు. కేసుల తీవ్రత దృష్ట్యా భౌతికదూరం పాటిస్తూ మాస్కులు పెట్టుకోవాలన్నారు. నగరంలో ఇప్పటివరకూ 458 పాజిటివ్ కేసులు, ఒక మరణం నమోదైనట్లు తెలిపారు.
జగన్నాథపురం, ఏటిమొగ, గుడారిగుంట ప్రాంతాల్లో కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు కమిషనర్ వివరించారు. నగరంలో పది చోట్ల కరోనా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.