తూర్పు గోదావరిజిల్లా పెదపూడి మండలం.. గొల్లలమామిడాడ గ్రామంలో కరోనా పాజిటివ్ కేసులు కలకలం సృష్టించాయి. ఇటీవల కరోనా లక్షణాలతో ఒక వ్యక్తి మృతి చెందాడు. శుక్రవారం మృతుడి భార్య , కుమారుడితో పాటు అదేగ్రామంలో ఉంటున్న మరో నలుగురికి కరోనా సోకింది. సమీప గ్రామమైన బిక్కవోలులో మరో 2 కేసులు నమోదయ్యాయి.
ఈ పరిణామంతో గ్రామంలోని ప్రజల్లో ఆందోళన నెలకొంది. అప్రమత్తమైన అధికారులు పాజిటివ్ వచ్చిన వ్యక్తులతో సంబంధం ఉన్న చుట్ట పక్కల వారికీ కరోనా పరీక్షలు చేశారు. ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. తాజా మరణంతో పాటు.. పాజిటివ్ కేసులు నమోదైన కారణంగా.. గ్రామం మొత్తాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి గ్రామంలో పర్యటించి పరిశీలించారు.
ఇదీ చదవండి: