ETV Bharat / state

అక్కడ కేసులు యమా యాక్టీవ్! - తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కేసుల సంఖ్య

తూర్పుగోదావరి జిల్లాలో రోజురోజుకి కరోనా విజృంభిస్తోంది. స్వీయ నియంత్రణ పాటించకపోవడం వల్ల అక్కడ కేసులు ఎక్కువవతున్నాయి. యంత్రాంగం చర్యలు తీసుకున్న ప్రజలు పాటించడం లేదు.

corona cases at east godavri district
తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కేసులు
author img

By

Published : Sep 12, 2020, 1:53 PM IST

కరోనా కన్నెర్రజేస్తోంది. వైరస్‌ తీవ్రతలో జిల్లా కొద్ది నెలలుగా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. సామాజిక వ్యాప్తి దిశగా వైరస్‌ పయనం సాగుతుండడంతో స్వీయ రక్షణే శరణ్యమనే వాదన అధికారుల నుంచి వినిపిస్తోంది. వెరీ యాక్టివ్, యాక్టిక్‌ జోన్లలోనే మరిన్ని కేసులు నమోదవుతుండడం అక్కడి ప్రజల నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తోంది. ఎవరికి వారు తమలో వైరస్‌ ఉందని భావించి జాగ్రత్తలు తీసుకుంటేనే ఇంట్లో వారికి, బయటి వ్యక్తులకు శ్రేయస్కరమని.. లేదంటే వైరస్‌ వ్యాప్తిని అరికట్టడం కష్టమనే వాదన బలంగా వినిపిస్తోంది.

corona cases at east godavri district
తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కేసులు

తూర్పుగోదావరి జిల్లాలో 64 మండలాలనూ కొవిడ్‌ మహమ్మారి చుట్టేసింది. కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల్లో ఇన్నాళ్లూ కనిపించిన కేసుల తీవ్రత ఇప్పుడు కోనసీమలోనూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. తాజా పరిస్థితిపై వైద్యారోగ్యశాఖతోపాటు కొవిడ్‌ విభాగం ప్రత్యేకంగా దృష్టిసారించింది. మన చుట్టూ ముప్పు..

కరోనా వైరస్‌ జాడలు కనిపించిన తొలి రోజుల్లో ఒక్క కేసు గర్తించినా ఆ చుట్టు పక్కలకు రాకపోకలు నిలిపివేసి రెడ్‌జోన్‌గా మార్చేవాళ్లు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఆరోగ్యసేతు యాప్‌లో 500 మీటర్లు, కిలోమీటరు పరిధిలో పదుల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు ఉన్నట్లు చూపుతున్నా ఆ జాడలే కనిపించడం లేదు. దీనికి కారణం పదుల సంఖ్యలో ఉన్న కేసులు ఇప్పుడు లక్షకు చేరువవుతుండడమే.. జిల్లావ్యాప్తంగా కేసులు ఉండడంతో ఇన్నాళ్లలా బారికేడ్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేసే పరిస్థితి లేదు. కేసు నమోదైనా ఇంటికే కంటైన్మెంట్‌ పరిమితం అవుతోంది. గతంలో మాదిరిగా చేతికి ముద్రలు వేసే పరిస్థితి లేకపోవడం.. హోం ఐసోలేషన్‌లో ఉంటున్న వారిపై ఆశ, ఆరోగ్య కార్యకర్తల పర్యవేక్షణ తగ్గిపోయింది. దీంతో పీడిత ప్రాంతాల్లోని పాజిటివ్‌ వ్యక్తులు కనీస అవసరాలు తీర్చుకోవడానికి కొందరు, నిర్లక్ష్యంగా మరికొందరు బయటకు వచ్చి తిరుగుతుండడంతో సమస్య వస్తోంది.

మారిన కంటైన్మెంట్‌ చిత్రం..

కేసుల తీవ్రత పెరగడగంతో కంటైన్మెంట్‌ వ్యవస్థ చిత్రమే మారింది. కంటైన్మెంట్, బఫర్‌ జోన్లలో తొలుత కిలోమీటర్ల మేర విధించిన ఆంక్షలు ఇప్పుడు పాజిటివ్‌ కేసున్న ఇంటికే పరిమితం అవుతున్నాయి. ఇప్పుడున్న యాక్టివ్, వెరీ యాక్టివ్‌ జోన్లలోనే 80 శాతం కేసులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. మారిన చిత్రంతో అక్కడ కేసులు ఉన్నాయో లేదో తెలుసుకోడానికి కనీసం బ్లీచింగ్‌ చల్లిన జాడలు కూడా కనిపించడంలేదు. ఆరోగ్య సేతు యాప్‌ ద్వారా అప్రమత్తం కావడం. ఎవరికి వారు మాస్కులు ధరించడం, వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు ఇతర జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమమనే వాదన వినిపిస్తోంది.

ఒక్క కేసూ నమోదు కాకపోతేనే.. పాజిటివ్‌ కేసు వచ్చిన అయిదు రోజుల వరకు ఆ ప్రాంతాన్ని వెరీ యాక్టివ్‌ జోన్‌గా గుర్తిస్తారు. ఆరు నుంచి 14 రోజుల వరకు ఆ ప్రాంతాన్ని (కొత్తగా కేసులు నమోదు కాకపోతే) యాక్టివ్‌ జోన్‌గా పిలుస్తారు. 15 నుంచి 28 రోజుల వరకు డార్మెంట్‌ జోన్‌గా పరిగణిస్తారు. ఈలోగా ఒక్క కేసుకూడా నమోదు కాకపోతే 28 రోజుల తర్వాత ఆ ప్రాంతంలో ఆంక్షలు ఎత్తివేస్తారు. జిల్లాలో పరిస్థితి చూస్తే 999 జోన్లలో కేవలం 92 మాత్రమే సురక్షిత స్థాయికి చేరుకోవడం గమనార్హం.

జాగ్రత్తలు తప్పనిసరి..

జిల్లాలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. కొద్ది నెలల్లో పరిస్థితి అదుపులోకి రావచ్చని భావిస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడంతోపాటు.. వ్యక్తిగత శుభ్రత, జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. నిర్లక్ష్యంగా బయటతిరిగితే ఇంట్లో వారికి, చుట్టుపక్కల వారికి ప్రమాదమనే విషయం గుర్తించాలి.

- కీర్తి చేకూరి, జిల్లా సంయుక్త కలెక్టర్

ఇదీ చూడండి. నిధుల వేటలో ప్రభుత్వం... గ్యాస్​పై 10 శాతం వ్యాట్ పెంపు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.