తూర్పుగోదావరి జిల్లాలో పలు గ్రామాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. మన్యం సహా కోనసీమ లంక గ్రామాల్లో స్వల్పంగా వరద తగ్గింది. దేవీపట్నం మండలంలో 36 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గిరిజనులు కొండల్లో తలదాచుకుని అవస్థలు పడుతున్నారు. వరదలకు జిల్లాలోని 168 గ్రామాలు ప్రభావితమయ్యాయని కలెక్టర్ తెలిపారు. లంక గ్రామాల్లో ఇళ్లలోకి వరదనీరు చేరడంతో డాబాల పైనే వంటలు చేసుకుంటున్నారు. వివిధ గ్యాస్ ఏజెన్సీలు వంట గ్యాస్ సిలిండర్లు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నా.. ఖాళీ సిలిండర్లను రహదారుల వద్దకు తీసుకురావడం వరద బాధితులకు కష్టంగా మారింది.
ఇదీ చదవండి: వరద గోదావరి.. తగ్గుతోంది.. ఇంకా నీళ్లలో నానుతున్న గ్రామాలు