ఇవీ చదవండి
మానవ మనుగడకు 'కాలుష్యమే' అతిపెద్ద ప్రమాదం - governor participated in convocation nananaiah varisity
రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ్య వర్సిటీలో 11, 12వ స్నాతకోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్యఅతిథిగా హజరయ్యారు.
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
మానవ మనుగడకు కాలుష్యం రూపంలో అతిపెద్ద ప్రమాదం ముంచుకొస్తోందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆందోళన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ్య వర్సిటీలో జరిగిన స్నాతకోత్సవానికి గవర్నర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో మొక్క నాటి నీరు పోశారు. అనంతరం వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు పతకాలు అందజేశారు. గాలి, నీరు, భూమి కలుషితం కావటం వల్ల భవిష్యత్తు తరాలు ఇబ్బంది పడాతయని, దీన్ని ఎదుర్కోవటానికి ప్రతి విద్యార్థి కనీసం 5 మొక్కలు నాటాలని గవర్నర్ పిలుపునిచ్చారు.
ఇవీ చదవండి
sample description