రాజస్థాన్‌లో భాజపా దొంగ రాజకీయాలు విరమించుకోవాలని... తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేసింది. కాకినాడలోని పార్టీ కార్యాలయం ఎదుట భాజపా తీరును నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ ఉన్నా... రకరకాల కారణాలు చూపుతూ గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. మధ్యప్రదేశ్, కర్ణాటక తరహాలో రాజస్థాన్‌లోనూ పార్టీలో చీలిక తెచ్చి భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మోదీ, అమిత్‌షాలు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి: