కరోనా రక్కసి నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు టీకా కోసం జనం అవస్థలు తప్పడం లేదు. వ్యాక్సిన్ రెండో డోసు వేసేందుకు కూపన్లు ఇచ్చినా... తీరా కేంద్రాల్లో సుదీర్ఘ నిరీక్షణ అనంతరం జనాలకు నిరాశే ఎదురవుతోంది. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని నారాయణపురం టీకా కేంద్రానికి ఉదయం నుంచి కూపన్లతో వ్యాక్సిన్ కోసం జనం తరలి వచ్చారు. అయితే కొందరికి మాత్రం టీకా ఇప్పుడు వేయబోమని సిబ్బంది సమాధానం చెప్పడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
45 రోజులు పూర్తైన వారికే..
మొదటి, రెండో డోసుకు మధ్య 45 రోజుల గడువు పూర్తైన వారికి మాత్రమే కోవిన్ పోర్టల్‌లో టీకా వేసేందుకు అనుమతి వస్తోంది. మారిన నిబంధనలపై ముందస్తు సమాచారం తెలియక రెండో డోసు కోసం ఉదయం 6 గంటలకే కేంద్రాల వద్దకు వచ్చిన వారికి నిరాశ తప్పలేదు. మొదటి డోసు 45 రోజులు పూర్తైన వారికి మాత్రమే వ్యాక్సిన్ వేస్తామని.. వైద్య సిబ్బంది అప్పటికప్పుడు ప్రకటించటంపై ప్రజలు వాగ్వాదానికి దిగారు. ఇదే అంశం ముందే చెప్పకుండా టీకా కేంద్రాలకు రప్పించి ఇబ్బందులు పెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు.
ఇవీ చూడండి: