తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం వీరవరంలో పకోడి బండి వద్ద బాలుడిని కారుతో ఢీకొట్టి చంపిన కేసులో....నిందితుడికి ఉరిశిక్షవేయాలంటూ బాలుడి తండ్రి డిమాండ్ చేశారు. కాకినాడ జీజీహెచ్ మార్చురీ వద్ద బాధిత కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు.
తమకు రూ.50 లక్షల పరిహారం అందించాని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ సంఘాలు, మాజీ ఎంపీ, కాంగ్రెస్ నాయకుడు హర్షకుమార్ సంఘీభావం తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 8 లక్షల 25 వేల రూపాయల పరిహారం అందిస్తామని అధికారులు ప్రకటించారు. తొలివిడతగా సగం డబ్బులను బాధితులకు అందజేశారు.
ఇదీ చదవండి: