తూర్పుగోదావరి జిల్లా బోడసకుర్రులోని కోవిడ్ కేర్ సెంటర్ను జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి పరిశీలించారు. ఈ కేంద్రంలో 1500 నుంచి 2000 వరకు పడకలు ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. అమలాపురం డివిజన్లో నమోదైన కరోనా బాధితులకు ఇక్కడ చికిత్స అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు. ఎవరైనా అడ్డుకుంటే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఆయనతోపాటే అమలాపురం ఆర్డీవో బి. హెచ్ భవాని శంకర్ గదులను పరిశీలించారు.
ఇదీ చూడండి. ఉరవకొండలో మరో ఆరుగురికి కరోనా పాజిటివ్