ETV Bharat / state

తుపాను ఎలాంటి ప్రభావం చూపినా..ఎదుర్కొనేందుకు సిద్దం - EAST GODAVARI collector

తుపాను ఎలాంటి ప్రభావం చూపినప్పటికీ ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉన్నట్లు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా వెల్లడించారు. సముద్రంలో వేటకు వెళ్ళిన మత్య్సకారులు ఉంటే వెంటనే తిరిగి రావాలని విజ్ఞప్తి చేసారు.

తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా
author img

By

Published : Apr 27, 2019, 4:45 AM IST

తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా
తుపాను ఎలాంటి ప్రభావం చూపినప్పటికీ ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉన్నట్లు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా వెల్లడించారు. ప్రస్తుతం మచిలీ పట్నానికి ఆగ్నేయంగా 7వందల కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైనట్లు తెలిపారు. మరో 24 గంటలు గడిస్తే తప్ప తుపాను తీవ్రతను అంచనా వేయలేమన్నారు. సముద్రంలో వేటకు వెళ్ళిన మత్య్సకారులు ఉంటే వెంటనే తిరిగి రావాలని విజ్ఞప్తి చేసారు. వేట నిషేధం అమల్లో ఉన్నప్పటకీ వేటకు వెళ్లి ఉంటే మత్య్సకార కుటుంబ సభ్యులు అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.

తుపాను ఎంత తీవ్రమైనా.. స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలు భద్రం
తీర ప్రాంతాల్లోని అధికారుల సెలవులు రద్దు చేసినట్లు కలెక్టర్ చెప్పారు. ఇప్పటికే రైతులు 75శాతం పంటను బస్తాల్లో భద్రం చేసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. మిగిలిన ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేస్తామన్నారు. ఎంత తీవ్రమైన తుపాను వచ్చినప్పటికీ స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలు భద్రంగా ఉంటాయని చెప్పారు.

Date:26-04-2019 Center:penu konda Contributor:c.a.naresh Cell:9100020922 బస్సు బోల్తా ఒకరు మృతి అనంతపురం జిల్లా రొద్దం మండలం పెద్దకోడిపల్లి వద్ద పెళ్లి బస్సు బోల్తా పడిన సంఘటన చోటు చేసుకుంది . ప్రయాణికులు కథనం మెరకు కడపజిల్లా వేంపల్లి నుంచి కర్ణాటకలోని చిత్రదుర్గలో జరిగిన పెళ్లి ముగించుకొని శుక్రవారం సాయంత్రం4గంటలకు తిరుగు ప్రయాణంలో రాత్రి10.45గంటల సమయంలో రొద్దం మండలం పెద్దకోడిపల్లి వద్ద బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో మల్లికార్జున(14),దాదాపు నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.