విద్యార్థులకు బూట్లు పంపిణీ చేసేందుకు అధికారులు విద్యార్థుల పాదాల కొలతలు సేకరిస్తున్నారు. జగనన్న విద్యా కానుక కింద ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు బూట్లు సరఫరా చేయనున్నారు. ఈ క్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థుల పాదాల కొలతలు తీసుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో గత వారం రోజులుగా ఈ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. జిల్లాలో మొత్తం 4300 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. విద్యార్థుల పాదాల కొలతల సేకరణ మరో మూడు రోజుల్లో పూర్తవుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి అబ్రహం తెలిపారు. దీనితో పాటుగా విద్యార్థుల అదనపు సమాచారాన్ని సేకరించి జగనన్న అమ్మ ఒడి వెబ్సైట్లో వివరాలను నమోదు చేస్తున్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 218 కరోనా పాజిటివ్ కేసులు