గోదావరి వరద ఉద్ధృతి కారణంగా... తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలోని లంక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా కొబ్బరి రైతులు కొబ్బరి కాయలను బయటకు తీసుకురావటానికి చాలా కష్టపడుతున్నారు. వరద నీరు తోటల్లోకి చేరటంతో...కొబ్బరి కాయలు నీటిలో కొట్టుకుపోతున్నాయి. వాటిని ఒడ్డుకు చేర్చటానికి రైతులు తీవ్రంగా శ్రమంచాల్సి వస్తోంది. కొబ్బరి కాయలు కొట్టుకుపోకుండా వాటి చుట్టూ వలలు ఏర్పాటు చేశారు. అయినా వరద ఉద్ధృతికి చాలా కొబ్బరికాయలు కొట్టుకుపోతున్నాయి.
ఇవీ చదవండి: ఉగ్ర గోదావరి ఉరకలేస్తోంది.. వరద ముంచెత్తుతోంది!