జగనన్న తోడు(Jagananna Thodu) పథకం కింద చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణం కింద రెండో విడత నిధులను ముఖ్యమంత్రి విడుదల చేశారు. అధిక వడ్డీలు తీర్చలేక చిరువ్యాపారులు అవస్థలు పడుతున్నారన్న జగన్.... వారి కష్టాలు తీర్చేందుకే జగనన్న తోడు పథకాన్ని చేపట్టినట్లు తెలిపారు. కరోనా కష్టకాలంలో సైతం “జగనన్న తోడు ” కార్యక్రమాన్ని అమలుచేస్తున్నట్లు వివరించారు.
తూర్పుగోదావరి జిల్లా
చిరువ్యాపారులు జగనన్న తోడు కింద ఇస్తున్న ఆర్థిక చేయూతతో అభివృద్ధి సాధించాలని పి.గన్నవరం శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబు అన్నారు. నియోజకవర్గంలో జగనన్న తోడు కార్యక్రమం కింద 1,368 మంది లబ్ధిదారులకు రూ.1,36,80,000 విలువ చేసే చెక్కులను అందజేశారు. రంపచోడవరంలో ఎమ్మెల్యే ధధనలక్ష్మీ... 1,027 మంది లబ్ధిదారులకు రూ.1,02,70,000 విలువ చేసే చెక్కులను అందజేశారు.
విశాఖ జిల్లా
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జగనన్న తోడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఎంతో మంది చిరు వ్యాపారులకు ఊరట కలిగిస్తుందని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పేర్కొన్నారు. నియోవర్గంలోని 2,910 మంది లబ్ధిదారులకు చెక్కలను పంపిణీ చేశారు.
శ్రీకాకుళం జిల్లా
శ్రీకాకుళం జిల్లాలో మంత్రులు ధర్మాన కృష్ణదాస్, సీదిరి అప్పలరాజులు లబ్ధిదారులకు రూ.16.69కోట్ల చెక్కును అందజేశారు.
ఇదీ చదవండి