ఇదీ చదవండి
అహేతుక విధానాలతో నేటికీ గాడిన పడని 'బడి'
'పేదల అభివృద్ధి కోసమే ఆంగ్ల మాధ్యమం'
రాష్ట్రంలోని పేద విద్యార్థులకు సైతం నాణ్యమైన విద్యను అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు చెప్పారు. అందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టారని అన్నారు.
కొండేటి చిట్టిబాబు
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని విద్యార్థులకు సులభ రీతిలో బోధించాలని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు సూచించారు. ఆంగ్ల మాధ్యమంపై తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలోని ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణా తరగతుల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం ఆంగ్లం నేర్చుకుంటేనే ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉందన్నారు. పేదవిద్యార్థికి సైతం నాణ్యమైన విద్యను అందించి వారి అభివృద్ధిని చూడాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి జగన్ ఆంగ్ల మాధ్యమాన్ని తీసుకువచ్చారన్నారు. అనంతరం ఎంపీపీ కార్యాలయం వద్ద లబ్ధిదారులకు బియ్యం కార్డులు ఆయన అందించారు.
ఇదీ చదవండి
అహేతుక విధానాలతో నేటికీ గాడిన పడని 'బడి'