ETV Bharat / state

తొలకరి చినుకులు.. మురిసిన జనాలు - east godavari

తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వాతావరణం చల్లబడింది. తొలకరి పలకరింతతో జనం పులకరించారు.

వాతావరణం
author img

By

Published : Jun 22, 2019, 12:04 PM IST

తొలకరి చినుకులు ప్రారంభం

ఇన్నాళ్లూ వేడిగాలులతో చెమటలు పట్టించిన వాతావరణం.. ఒక్కసారిగా మారిపోయింది. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని తాళ్ళరేవు, ఐ.పోలవరం, కాట్రేనికోన, మమ్మిడివరం మండలాల్లో ఉదయం నుండి చల్లటిగాలులు వీస్తున్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. వాతావరణంలో వచ్చిన మార్పుతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు.

తొలకరి చినుకులు ప్రారంభం

ఇన్నాళ్లూ వేడిగాలులతో చెమటలు పట్టించిన వాతావరణం.. ఒక్కసారిగా మారిపోయింది. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని తాళ్ళరేవు, ఐ.పోలవరం, కాట్రేనికోన, మమ్మిడివరం మండలాల్లో ఉదయం నుండి చల్లటిగాలులు వీస్తున్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. వాతావరణంలో వచ్చిన మార్పుతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు.

Intro:వెంగమాంబ బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు సిద్ధం....
రేపటి నుంచి నిలుపు తో ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలు



Body:పతి భక్తికి ప్రతిరూపంగా.... కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా
.. సిరిసంపదలను ప్రసాదించే శ్రీ మహాలక్ష్మిగా... సంతాన భాగ్యాన్ని ప్రసాదించే తల్లి గా... భక్తుల పాలిట కొంగు బంగారంగా... మెట్ట ప్రాంత ప్రజల ఆరాధ్య దైవం గా విరాజిల్లుతున్న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో వెలసియున్న శ్రీ వెంగమాంబ పేరంటాలు బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కావడంతో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మండలి, దేవాదాయ శాఖ అధికార యంత్రాంగం, ధర్మకర్తల ఆధ్వర్యంలో లో ఏర్పాటు సిద్ధమయ్యాయి. వెంగమాంబ బ్రహ్మోత్సవాలు ప్రసిద్ధిగాంచిన కావడంతో రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు బ్రహ్మోత్సవాలకు తరలి వస్తారు. వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చురుగ్గా ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఐదు రోజుల పాటు జరుగనున్న బ్రహ్మోత్సవాలు...
ప్రతి ఏటా జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే ఆదివారం మొదలుకొని ఐదు రోజుల పాటు అత్యంత వైభవంగా వెంగమాంబ పేరంటాలు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఆదివారం నిలుపు తో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారి నిలుపు, సంతానం లేని వారు వర పడుట, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సోమవారం అమ్మ వారి రథోత్సవం, సంతానం లేని వారు వర పడుట, మంగళవారం రథోత్సవం, బుధవారం అమ్మవారికి పసుపు, కుంకుమ ఉత్సవం, కల్యాణోత్సవం, రాత్రికి ప్రధానోత్సవం నిర్వహిస్తారు. గురువారం అమ్మవారికి పొంగళ్లు, రాష్ట్రస్థాయి ఎడ్ల జతల బండలాగుడు ప్రదర్శన పోటీలను నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులకు సౌకర్యంగా ఉండేందుకు ఈ సంవత్సరం అనేక రకాల నూతన కట్టడాలను ఆలయ ప్రాంగణంలో అందుబాటులోకి తెచ్చారు.



Conclusion:బైట్ : పచ్చవ కరుణాకర్ బాబు, ఆలయ చైర్మన్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.