ప్రాణాలు నిలిపేందుకు ఉపయోగపడేలా ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి సేవా కార్యక్రమాలు అభినందనీయమని మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకును మంత్రి విశ్వరూప్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఆయన సేవా కార్యక్రమాలు అభినందనీయమని మంత్రి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో అమలాపురం మున్సిపల్ ఛైర్పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి , వివిధ పార్టీల నాయకులు అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి. గంగానదిలో మరోసారి మృతదేహాల కలకలం