వైకాపా పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు... కేబినెట్ కక్షపూరిత నిర్ణయాలు తీసుకుందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వ అవినీతిపై సీబీఐ విచారణకు జగన్ సిద్ధమా అని ఆయన సవాల్ విసిరారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వైకాపా వెంపర్లాడుతుందని విమర్శించారు.
కక్ష సాధింపు రాజకీయాలు, చట్ట వ్యతిరేక చర్యలపై ఉన్నత న్యాయస్థానాలు పదేపదే తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నా వైకాపా తీరు మారటంలేదన్నారు. కేబినెట్ నిర్ణయాలు జగన్ వికృత చర్యలకు అద్దం పట్టాయని విమర్శించారు. పేదలకు ఇళ్ల స్థలాల కొనుగోలులో వైకాపా ఎమ్మెల్యేల అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఎమ్మెల్యేల అవినీతి, నాసిరకం మద్యం అమ్మకాలపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి : 'తెదేపా హయాంలోని ఆ పథకాలపై సీబీఐ విచారణ'