ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఎవరినీ వైకాపాలోకి తీసుకోబోనని చెప్పిన జగన్... ఇప్పుడెందుకు ప్రోత్సహిస్తున్నారని తెదేపా నేత నిమ్మకాయల చినరాజప్ప ప్రశ్నించారు. వాసుపల్లి గణేష్‌ను వైకాపాలోకి ఆహ్వానించడం అనైతికమని వ్యాఖ్యానించారు. గణేష్ వెళ్లడం వల్ల తెదేపాకి వచ్చిన నష్టం ఏమీలేదని పేర్కొన్నారు. తల్లిలాంటి పార్టీని వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. తాను గెలిచింది చంద్రబాబు కారణంగానే అనే విషయం గణేష్ గుర్తు పెట్టుకోవాలని సూచించారు. విశాఖ అభివృద్ధికి చంద్రబాబు చేసిన కృషి ఫలితంగానే విశాఖలో తెదేపా గెలిచిందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలను విస్మరించారని ధ్వజమెత్తారు.
ఇదీ చదవండీ... 'ప్రభుత్వాన్ని ప్రశ్నించటం మాని... ప్రతిపక్షంపై విమర్శలేంటి?'