ETV Bharat / state

ముంపు సాకుతో రాజధానిని మార్చాలనుకుంటున్నారు!

వరద ముంపు సాకుతో రాజధానిని మార్చాలనుకోవటం సరికాదని తెదేపా నేత చినరాజప్ప తెలిపారు.

author img

By

Published : Aug 23, 2019, 2:16 AM IST

చినరాజప్ప

బ్రహ్మాండమైన రాజధానిని నిర్మించాలనే తలంపుతో అమరావతి ఏర్పాటు చేస్తే.. వరద ముంపు సాకుతో దాన్ని మార్చాలనే ఆలోచన వైకాపా ప్రభుత్వం మానుకోవాలని తెదేపా నేత చినరాజప్ప హితవు పలికారు. కృష్ణా, గోదావరులకు వరదలు రావడం, విశాఖ వంటి సముద్ర తీర ప్రాంతాలకు తుపానులు రావడం సహజమని... ఆ వంకతో రాజధానిని తరలిస్తారా అని ప్రశ్నించారు. రాజధానిపై మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. ఇప్పటికే అమరావతిలో భారీ స్థాయిలో ప్రభుత్వ కార్యాలయాలు, ఉద్యోగుల నివాసాల నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు. చంద్రబాబు చేపట్టిన అమరావతి నిర్మాణం మరింత బాగా చేసి పేరు తెచ్చుకోవాలని జగన్ ప్రభుత్వానికి సూచించారు. గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాల పేరిట ప్రస్తుతమున్న ఉద్యోగులను తొలగించడం సరికాదన్నారు. ప్రజలు ఇచ్చిన అధికారం సద్వినియోగం చేసుకుని మంచి పాలన అందించాలన్నారు.

ముంపు సాకుతో రాజధానిని మార్చాలనుకుంటున్నారు

ఇది కూడా చదవండి.

కోర్టును గౌరవిస్తాం.. పవర్ ప్రాజెక్టుపైనే తీర్పు

Intro:కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు లు వసంత కృష్ణ ప్రసాద్ ఈరోజు ఆక్స్ఫర్డ్ పాఠశాల నందు అటల్ టింకరింగ్ ల్యాబ్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు రిబ్బన్ కట్ చేసి ల్యాబ్ ను ప్రారంభించిన అనంతరం ల్యాబ్ లో పలు పరికరాలు రోబోటిక్ యంత్రాల పనితీరు కంప్యూటర్ పరికరాలు పరిశీలించారు అనంతరం స్కూల్ విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే ప్రసంగించారు దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతిలో ఉందని అటువంటి విద్యార్థుల కోసం కేవలం తరగతులు నిర్వహణ మాత్రమే కాకుండా ఇటువంటి ల్యాబ్ ల ద్వారా విద్యార్థులను మరింత ప్రతిభావంతులుగా మలచడానికి కృషిచేసిన స్కూల్ యాజమాన్యాన్ని ప్రశంసలతో పొగిడారు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి లేబు లను పాఠశాల లో ఏర్పాటు చేయడానికి నిధులు కేటాయించడం హర్షణీయమన్నారు ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం లైన్స్ క్లబ్ గవర్నర్ తదితరులు పాల్గొన్నారు

Body:ఆక్స్ఫర్డ్ స్కూల్ లో సైన్స్ ల్యాబ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్

Conclusion:మైలవరంలో ఆక్స్ఫర్డ్ స్కూల్ లో ల్యాబ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.