కొవిడ్‌తో ఉపాధి కోల్పోయిన నిరు పేదల జీవనం దుర్లభంగా మారింది. ఒంటరిగా నివసించే వారికి ఆహారం దొరకడమే కష్టమవుతోంది. లాక్ డౌన్ తో దాతలు మధ్యాహ్నం వరకే ఆహారం పంపిణీ చేస్తున్నారు. రాత్రి భోజనం దొరక్క చాలా మంది పస్తులు ఉంటున్నారు. ఇలాంటి వారి అవసరం గుర్తించి రాజమహేంద్రవరంలో సాయి మహేంద్ర ట్రేడర్స్ ఆధ్వర్యంలో రాత్రి పూట కూడా భోజనం అందిస్తున్నారు.
వలస కూలీలు, హెల్స్ వర్కర్లకు ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు. గోదావరి గట్టుతోపాటు నగరంలోని వివిధ కూడళ్లు, ఆర్టీసీ కాంప్లెక్స్, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిత్యం 500 మందికి పైగా భోజనం ప్యాకెట్లు అందిస్తున్నారు.
కరోనా రెండో దశలో తక్కువ మంది దాతలు మాత్రమే ఆహారం అందిస్తుండగా.. రాత్రి పూట భోజనంపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. సాయి మహేంద్ర ట్రేడర్స్ తో కలిసి కొల్లివెలిస హారిక ఆపదలో పేదల ఆకలి తీర్చుతూ అన్నపూర్ణగా మారారు.
ఇదీ చదవండి:
Anandaiah Medicine: రేపటి నుంచే ఆనందయ్య మందు పంపిణీ.. ముందుగా అక్కడే..!