భవిష్యత్‌లో ఎన్ని కొవిడ్ వేవ్‌లు ఎదురైనా... వాటిని ఎదుర్కొని వైద్యం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ అన్నారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు దాతల సహకారం దోహదపడుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయంలో సింగపూర్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు రూ.3కోట్లు విలువైన వంద ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, 20 వెంటిలేటర్లను సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ చేతుల మీదుగా రాష్ట్ర రెడ్‌క్రాస్ సొసైటీ ఛైర్మన్ డాక్టర్ శ్రీధర్‌రెడ్డికి అందజేశారు.
తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో కరోనా నియంత్రణకు క్షేత్ర స్థాయిలో పనిచేసే సిబ్బందికి థర్మల్ స్కానర్లు, పల్స్ ఆక్సీమీటర్లు, పీపీఈ కిట్లు, శానిటైజర్లు, మాస్కులు, గ్లౌజ్‌లు పంపిణీ చేశారు. స్టాన్‌ఫర్డ్, ఫ్లోరిడా ప్రవాస భారతీయులు గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్, 150 ఆక్సీమీటర్లను ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతికి అందచేశారు. కరోనా కష్టకాలంలో సేవలందిస్తున్న మునిసిపల్ కార్మికులకు ప్రకాశం జిల్లా కనిగిరిలో సన్మానించారు. గుంటూరు జిల్లా తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్‌కు దాత కాట్రగడ్డ వెంకటేశ్వరరావు నాలుగు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందించారు.
విజయవాడలో సీపీఐ ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఆహారం, మాస్కులు పంపిణీ చేశారు. రేషన్ ద్వారా బియ్యం మాత్రమే కాకుండా నిత్యవసర వస్తువులు పంపిణీ చేయాలని కోరారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో గోకరాజు రామరాజు మిత్రబృందం ఆధ్వర్యంలో వంద మంది పేద బ్రాహ్మణులకు నిత్యావసర సరకులు, బియ్యం పంపిణీ చేశారు.
ఇదీచదవండి.