తెలుగుదేశం అధినేత చంద్రబాబు రెండ్రోజుల పర్యటనలో భాగంగా తూర్పు గోదావరి చేరుకున్నారు. ఇవాళ, రేపు కాకినాడలో మకాం వేయనున్న ఆయన తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నేతలతో విడివిడిగా సమీక్ష నిర్వహించి... కార్యకర్తలతో ముఖాముఖి కానున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సమీక్షలు నిర్వహించనున్నారు. జిల్లాలో మొత్తం 19 అసెంబ్లీ స్థానాలుండగా...ఇవాళ 9 నియోజకవర్గాల నేతలతో సమావేశమవుతారు. మిగతా పది నియోజకవర్గాల నేతలతో రేపు చర్చిస్తారు. ఇకపై ప్రతివారం ఒక్కో జిల్లాలో రెండు రోజులపాటు....తన పర్యటన ఉండేలా చంద్రబాబు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోనే రెండు రోజులు పాటు ఉంటూ నేతలు కార్యకర్తలను స్వయంగా కలవనున్నారు. జిల్లా పార్టీ జనరల్ బాడీ సమావేశం, ప్రజాప్రతినిధులు, ఇన్ చార్జ్ లు, సమన్వయ కమిటీ సభ్యులతో భేటీలు నిర్వహిస్తారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు, కార్యకర్తలతో సమావేశాలు చేపడతారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై చేపట్టాల్సిన పోరాటాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. అధినేత పర్యటన ఏర్పాట్లను మాజీ హోం మంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
నేడు తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన - cbn tour of east godari start from today
రెండ్రోజుల పర్యటనలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు తూర్పు గోదావరి చేరుకున్నారు. ఆయనకు రావులపాలెంలో నేతలు స్వాగతం పలికారు. ఎన్నికల అనంతరం ఆయన జిల్లాకు ఇదే తొలిసారి. ఎన్నికల్లో ఓటమికి గల కారణాలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సి చర్యలు, ప్రస్తుత ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలతో పాటు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించనున్నారు. తొలి రోజు 9 నియోజకవర్గాల సమన్వయకర్తలు, ముఖ్య నేతలతో మాట్లాడనున్న ఆయన రేపు మరో 10 అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో చర్చించనున్నారు.
![నేడు తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4341631-457-4341631-1567630693362.jpg?imwidth=3840)
తెలుగుదేశం అధినేత చంద్రబాబు రెండ్రోజుల పర్యటనలో భాగంగా తూర్పు గోదావరి చేరుకున్నారు. ఇవాళ, రేపు కాకినాడలో మకాం వేయనున్న ఆయన తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నేతలతో విడివిడిగా సమీక్ష నిర్వహించి... కార్యకర్తలతో ముఖాముఖి కానున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సమీక్షలు నిర్వహించనున్నారు. జిల్లాలో మొత్తం 19 అసెంబ్లీ స్థానాలుండగా...ఇవాళ 9 నియోజకవర్గాల నేతలతో సమావేశమవుతారు. మిగతా పది నియోజకవర్గాల నేతలతో రేపు చర్చిస్తారు. ఇకపై ప్రతివారం ఒక్కో జిల్లాలో రెండు రోజులపాటు....తన పర్యటన ఉండేలా చంద్రబాబు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోనే రెండు రోజులు పాటు ఉంటూ నేతలు కార్యకర్తలను స్వయంగా కలవనున్నారు. జిల్లా పార్టీ జనరల్ బాడీ సమావేశం, ప్రజాప్రతినిధులు, ఇన్ చార్జ్ లు, సమన్వయ కమిటీ సభ్యులతో భేటీలు నిర్వహిస్తారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు, కార్యకర్తలతో సమావేశాలు చేపడతారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై చేపట్టాల్సిన పోరాటాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. అధినేత పర్యటన ఏర్పాట్లను మాజీ హోం మంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
Body:ప్రశాంతంగా వినాయక నిమజ్జనం
Conclusion:ప్రశాంతంగా వినాయక నిమజ్జనం