గురుపూజోత్సవం సందర్భంగా ప్రైవేటు ఉపాధ్యాయులు, విద్యాస్థంస్థల అధినేతలతో వర్చువల్గా మాట్లాడారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ప్రైవేటు ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ ... స్వేచ్ఛగా పని చేసుకునే హక్కు కల్పించిందని గుర్తు చేశారు. ప్రైవేటు ఉపాధ్యాయులు ఆందోళనలకు దిగుతున్నారని.. దీనిపై ఆలోచించాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు.
ప్రకృతి వ్యవసాయం దిశగా...
గురుపూజోత్సవ వేడుక అనంతరం తన వ్యవసాయం క్షేత్రంలో డ్రోన్ ద్వారా మందు పిచికారి చేశారు లక్ష్మీనారాయణ. రైతులు ప్రకృతి వ్యవసాయం దిశగా అడుగులు వేయాలని కోరారు. గత ఐదు నెలలుగా ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించానని.. ఫలితంగా రైతుల కష్టాలు తెలుసుకునే అవకాశం దొరికిందని చెప్పారు.
ఇదీ చదవండి: MP VIJAYA SAI: 'విశాఖ-విజయనగరం జంటనగరాలవుతాయి'