ప్రధాని నరేంద్రమోదీ రెండో దఫా ఏడాది పాలనలో సుధీర్ఘ సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపారని మాజీ మంత్రి, భాజపా నాయకులు పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగిన భాజపా ఏడాది పాలన వేడుకలో ఆయన పాల్గొన్నారు. మోదీ పాలనలో అవినీతి రహిత పాలన, వేగవంతమైన అభివృద్ధి సాధ్యమైందన్నారు. అభివృద్ధి చెందిన దేశాలను వణికిస్తున్న కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారని కొనియాడారు.
రాష్ట్రంలో గత ప్రభుత్వ అవినీతితోపాటు ప్రస్తుత ప్రభుత్వ అవినీతిపై... సీబీ సీఐడీ విచారణ జరిపితే ప్రజలు హర్షిస్తారని అన్నారు.
ఇదీ చదవండి: