తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ మండలం కాతేరులోని శాంతినగర్కి చెందిన 72 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ అని వైద్యులు నిర్ధరణ చేసినట్లు అధికారులు తెలిపారు. ఆయన ఉండే ప్రాంతానికి 3 కిలో మీటర్ల మేర అధికారులు ఆంక్షలు విధించారు. బారికేడ్లు వేసి అటువైపు ఎవరినీ వెళ్లనీయకుండా కఠిన చర్యలు అమలు చేశారు. ఆ ప్రాంతానికి చెందిన 19 మందిని ఆసుపత్రికి తరలించారు. కాతేరు పంచాయతీ కార్యాలయం వద్ద సచివాలయం సిబ్బందితో పాటు వాలంటీర్లతో ఉన్నతాధికారులు సమీక్షించారు. అనంతరం ఆ ప్రాంతమంతా శుభ్రం చేయించి బ్లీచింగ్ చల్లించారు.
ఇవీ చదవండి: