తూర్పు గోదావరి అన్నవరం జాతీయ రహదారి పై గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ప్రత్తిపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు ద్విచక్ర వాహనంపై తరలిస్తుండగా పట్టుకున్నామనని ప్రత్తిపాడు సీఐ పేర్కొన్నారు. నిందితులు ప్రకాశం జిల్లా పొదిలి మండలం కొత్తపాలెం, ఓబుల్లంక గ్రామాలకు చెందిన నారాయణ రెడ్డి, శేషారెడ్డి లుగా పోలీసులు గుర్తించారు. వారి వద్దనున్న 20 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ప్రత్తిపాడు సీఐ రాంబాబు తెలిపారు.
ఇదీ చదవండి అమలాపురంలోని 16 మండలాల్లో కొత్త నిబంధనలు