కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరి 15వ శాసనసభకు నేటి నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కావడంతో.. ప్రధాన పార్టీల నాయకులు ప్రచారం ప్రారంభించారు. యానాం అసెంబ్లీ స్థానానికి.. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రంగసామి పోటీచేయనున్నారు. ఈనెల 15 లేదా 17న పుదుచ్చేరి నుంచి వచ్చి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ సమర్పించనున్నారు.
రంగసామి తరపున అభిమానులతో కలిసి యానాం మాజీ శాసనసభ్యులు, మాజీమంత్రి మల్లాడి కృష్ణారావు ప్రచారం మొదలుపెట్టారు. సెంటిమెంట్‌గా దరియాలతిప్ప రామాలయంలో మల్లాడి పూజలు నిర్వహించారు. స్థానిక ఓటర్లును కలిసి పార్టీగుర్తైన జగ్గుకు ఓటువేయాలని అభ్యర్థించారు. అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు.
మొదటిరోజు బోణీ కాలేదు...
నేటి నుంచి 17 వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుందని రిటర్నింగ్ అధికారి అమన్ శర్మ తెలిపారు. శని, ఆదివారం సెలవులని పేర్కొన్నారు. మొదటిరోజు ఒక్క నామినేషనూ దాఖలు కాలేదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: అవినీతిని ఎండగట్టినందుకు కేసులు పెడతారా..?: లోకేశ్