తూర్పుగోదావరి జిల్లా తుని మండలం లోవకొత్తూరు వద్ద గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. కొత్త వెలంపేట శివారులో ఉన్న తోటలో దహనమై ఉన్న మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిసరాలను పరిశీలించారు. ఎక్కడో హత్య చేసి ఇక్కడకు తీసుకువచ్చి కాల్చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతిచెందిన మహిళ ఎవరు, ఏ ప్రాంతానికి చెందినది, ఘటన ఎలా జరిగింది అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: కురుగుంటలో విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి