తూర్పు గోదావరి జిల్లా అనపర్తి బాలికల ఉన్నత పాఠశాలలో పూర్తయిన అభివృద్ధి పనులు.. విద్యార్థినులకు అందుబాటులోకి తెచ్చారు. ప్రముఖ వైద్యాధికారి డా. తేతలి సత్యనారాయణ రెడ్డి ఆర్థిక సహకారంతో మంచినీటి బోరు, షటిల్, బాడ్మింటన్ కోర్టులను ఏర్పాటు చేశారు.
దాత సత్యనారాయణ రెడ్డితో కలిసి అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి.. వాటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, దాతకు విద్యార్థులు, ఉపాధ్యాయులు కరతాళ ధ్వనులతో స్వాగతం పలికి ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చూడండి: