జిల్లాల సరిహద్దుల వద్ద రాకపోకలు నిలిపివేత - ఏపీ లాక్డౌన్ వార్తలు
రాష్ట్రంలో లాక్డౌన్ ప్రకటించినా వాహనదారులు రోడ్లపైకి వస్తుండటంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల సరిహద్దులలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. రెండు జిల్లాల మధ్య వాహనాల రాకపోకలు సాగించకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. తుని, పాయకరావుపేట తాండవ వంతెన జాతీయ రహదారిపై పోలీసులు మోహరించి ఎవర్ని అనుమతించడం లేదు.