తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచిలో సుమారు ఏడడుగుల పొడవు ఉన్న రక్తపింజరి పామును రైతులు చంపారు. పట్టిసం వెంకట ప్రసాద్ అనే రైతు పొలంలో పని చేస్తుండగా పాము అతనిపై దాడికి యత్నించింది. అక్కడే ఉన్న మిగతావారు గమనించి దాన్ని కర్రలతో కొట్టి చంపారు. ఇటీవల వచ్చిన వరదలతో మెట్టలో సర్పాలు అధికంగా సంచరిస్తున్నాయి.
ఇదీ చదవండి:
ఏ పార్టీలోకి వెళ్లినా.. తిరిగి తెదేపాలోకే రావాలి: జ్యోతుల నెహ్రూ