Blast At Vision Drugs Industry : తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నం వద్ద రసాయన కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు దుర్మరణం చెందారు. విజన్ డ్రగ్స్ పరిశ్రమలో ఇథైల్ కాలమ్ గొట్టంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ నేపథ్యంలో మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా పేలి చాగల్లుకు చెందిన మహీధర్ ముసలయ్య, తాజ్యంపూడి వాసి రత్నబాబు, గౌరీపట్నంకు చెందిన సత్యనారాయణ అనే ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రులను కొవ్వూరు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బాధిత కుటుంబ సభ్యుల్ని హోం మంత్రి తానేటి వనిత పరామర్శించారు. జేసీ శ్రీధర్, ఇన్ఛార్జ్ ఎస్పీ సుధీర్‌కుమార్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే తలారి వెంకట్రావు.. పరిశ్రమను సందర్శించి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ వ్యహారంపై జిల్లా యంత్రాంగం విచారణ చేపట్టింది.
ఇవీ చదవండి: