ETV Bharat / state

BJP Purandeshwari fire on YCP : 'కేంద్రం నిధులు దారి మళ్లిస్తున్న వైఎస్సార్​సీపీ సర్కారు.. సర్పంచ్​లకు మద్దతుగా 10న రాష్ట్ర వ్యాప్త ధర్నా'

BJP Purandeshwari fire on YCP : కేంద్రం నిధులను రాష్ట్రం దారి మళ్లిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఆరోపించారు. వైఎస్సార్​సీపీ ప్రభుత్వం.. పంచాయతీలను నిర్వీర్యం చేసిందన్న పురందేశ్వరి.. నిధుల దారిమళ్లింపుపై సర్పంచులు పార్టీలకతీతంగా తమ మద్దతు కోరిన నేపథ్యంలో ఈ నెల 10న రాష్ట్ర వ్యాప్త ధర్నాలకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. సర్పంచులకు బీజేపీ పూర్తి మద్దతుగా నిలుస్తుందని పురందేశ్వరి స్పష్టం చేశారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి
author img

By

Published : Jul 26, 2023, 2:12 PM IST

Updated : Jul 26, 2023, 3:36 PM IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి

BJP Purandeshwari fire on YCP : కేంద్రం నిధులను రాష్ట్రం దారి మళ్లిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఆరోపించారు. వైఎస్సార్​సీపీ ప్రభుత్వం.. పంచాయతీలను నిర్వీర్యం చేసిందన్న పురందేశ్వరి.. నిధుల దారిమళ్లింపుపై సర్పంచులు పార్టీలకతీతంగా తమ మద్దతు కోరిన నేపథ్యంలో ఈ నెల 10న రాష్ట్ర వ్యాప్త ధర్నాలకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. సర్పంచులకు బీజేపీ పూర్తి మద్దతుగా నిలుస్తుందని పురందేశ్వరి స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి రాజమహేంద్రవరంలో మీడియా సమావేశం నిర్వహించారు. పేదల వికాసం, అభివృద్ధే బీజేపీ లక్ష్యమని ఆమె అన్నారు. రాష్ట్రానికి కేంద్రం పూర్తి మద్దతుగా నిలిచిందని చెప్పారు. పేదలకు ఎన్ని ఇళ్లు ఇచ్చారో, ఇప్పటివరకు ఎన్ని ఇళ్లు పూర్తిచేశారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని పురందేశ్వరి డిమాండ్ చేశారు. గోదావరి జిల్లాలు, రాష్ట్రానికి కేంద్రం పలు సంస్థలు కేటాయించిందని, కేంద్రం నిధులు ఏమయ్యాయో వైసీపీ ప్రభుత్వం చెప్పాలని నిలదీశారు.

కేంద్రం నిధులను రాష్ట్రం దారి మళ్లిస్తోందన్న పురందేశ్వరి.. వైఎస్సార్​సీపీ ప్రభుత్వం పంచాయతీలను నిర్వీర్యం చేసిందన్నారు. నిధుల దారి మళ్లింపుపై సర్పంచులు పార్టీలకతీతంగా తమ మద్దతు కోరారని, వారికి బీజేపీ పూర్తి మద్దతుగా నిలుస్తోందని వెల్లడించారు. వైసీపీ పాలనలో మట్టి మాఫియా, ఇసుక మాఫియా చెలరేగిపోతోందని, చిన్న కాంట్రాక్టర్లు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి తీసుకొచ్చారని పురందేశ్వరి ఆరోపించారు. మూడు వేల కోట్ల ధరల స్థిరీకరణ ఏర్పాటు చేశారా? అని ఆమె ప్రశ్నించారు. జనసేనతో పొత్తు ఉంది.. మిగతా పార్టీలపై అధిష్ఠానం చూసుకుంటుందన్న పురందేశ్వరి.. ప్రజా సమస్యలపై పోరాడుతూ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యమని చెప్పారు. వచ్చెనెల 10న జిల్లాల్లో సర్పంచులకు మద్దతుగా ధర్నాలు, 17న రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యలపై భారీ సభ ఉంటుందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం ఇప్పటికీ కట్టుబడి ఉందని పురందేశ్వరి చెప్పారు.

ఎస్సీ, బీసీలపై దాడులు.. వైఎస్సార్​సీపీ ప్రభుత్వం.. దొంగ ఓట్లతో ఎన్నికల్లో గెలవాలని చూడటం దుర్మార్గం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. గుంటూరులో మంగళవారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో దొంగ ఓట్లపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని, దొంగ ఓట్ల అంశంపై వచ్చే నెల10న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో దౌర్జన్యాలు, దాడులు పెరిగాయని పురందేశ్వరి ఆరోపించారు. రాష్ట్రంలో ఎస్సీ, బీసీలపై దాడులు నిత్యకృత్యమయ్యాయన్న పురందేశ్వరి.. ఎస్సీ మహిళపై అత్యాచారం జరిగితే న్యాయం జరిగే పరిస్థితి లేదని, విద్యార్థిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి హత్య చేసినా పట్టించుకున్న నాథుడే లేడని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో రాష్ట్రానికి కొత్తగా ఒక పరిశ్రమ కూడా రాలేదని, గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు. ఎన్టీఆర్ వైద్య వర్సిటీ పేరు మార్పుతో సాధించిందేమీ లేదన్న పురందేశ్వరి.. రాష్ట్రంలో వైద్యసీట్ల అమ్మకానికి యత్నిస్తున్నారని ఆరోపించారు.

  1. BJP Purandheswari 'సీమ రైతులు, యువతను మోసం చేసిన ప్రభుత్వమిది! పొత్తులు ఢిల్లీ పెద్దలు చూసుకుంటారు! '

Last Updated : Jul 26, 2023, 3:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.