ETV Bharat / state

'రాష్ట్రంలో ఐపీసీ సెక్షన్​కు బదులు.. వైసీపీ సెక్షన్​ అమలవుతోంది' - bjp leader ravi kiran fire on govt

రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులకు మనస్థాపం చెందిన యువకులు సామాజిక మాధ్యమల్లో వారి ఆవేదనను తెలుపుతుంటే.. వారిపై కేసులు పెట్టడాన్ని భాజపా రాష్ట్ర మీడియా ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ ఖండించారు. లైకులు, షేర్లు చేసిన వారందరనీ అరెస్ట్ చేయాలంటే జైళ్లు సరిపోవన్నారు. రాష్ట్రంలో ఐపీసీ సెక్షన్​కు బదులు వైసీపీ సెక్షన్​ అమలవుతోందని ఎద్దేవా చేశారు.

bjp state leader fires on governmernt
భాజపా రాష్ట్ర మీడియా ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్
author img

By

Published : Jan 16, 2021, 3:35 PM IST

సామాజిక మాధ్యమాల్లో దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ లైకులు, షేర్లు చేసిన వారందరినీ అరెస్ట్ చేసినట్లయితే రాష్ట్రంలో జైళ్లు సరిపోవని డీజీపీ గుర్తుపెట్టుకోవాలని భాజపా రాష్ట్ర మీడియా ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడితో డీజీపీ భోగి రోజు ఒక మాట.. కనుమ రోజు మరో మాట చెప్పటం పోలీస్ వ్యవస్థ స్థాయిని తగ్గించడమే కాక.. ప్రజల్లో పోలీసుల పట్ల నమ్మకాన్ని తగ్గించే విధంగా ఉందన్నారు.

రాష్ట్రంలో భావప్రకటన స్వేచ్ఛ కేవలం వైకాపా జాగీర్​లా ఉందని రవికిరణ్ మండిపడ్డారు. ఆలయాలపై జరుగుతున్న దాడులకు మనస్థాపం చెంది సామాజిక మాధ్యమాల్లో హిందువులు తమ ఆవేదనను తెలిపితే... దాన్ని కూడా ప్రభుత్వం తప్పుపట్టి మత ఘర్షణలకు ప్రేరేపిస్తున్నారంటూ బాధితుల గొంతు నొక్కేస్తున్నారని రవికిరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే తప్పుగా కనిపిస్తుంటే మరీ మంత్రి కొడాలి నాని హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలు ఎందుకు తప్పుగా కనపడటం లేదని ప్రశ్నించారు.

రాష్ట్రంలో ఐపీసీ సెక్షన్​కి బదులుగా వైసీపీ సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఉందని రవికిరణ్ ఎద్దేవా చేశారు. అసలు దోషుల్ని పట్టుకోలేక చతికిలపడ్డ ఈ ప్రభుత్వం ప్రజల దృష్టి మరల్చే రాజకీయ వేధింపులకు దిగజారుతోందని రవికిరణ్ మండిపడ్డారు. సామాజిక మాధ్యమాల్లో కేవలం తెదేపా, భాజపా నాయకులు మాత్రమే లైకులు, షేర్లు చేశారా? వైకాపా నాయకులు చేయలేదా? అని రవికిరణ్ నిలదీశారు. రాజకీయ కక్ష సాధింపే ప్రధాన లక్ష్యంగా అసలు ముద్దాయిని రక్షించే విధంగా జగన్ సర్కార్ పెట్టిన ఈ తప్పుడు కేసులను బేషరతుగా ఎత్తివేయాలని, హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి

ముద్రగడను కలిసిన సోము వీర్రాజు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.