తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం మానేపల్లిలోని పంట కాల్వలో తెలుపు నలుపు చారలు కలిగిన చేపలు గంగపుత్రుల వలలో చిక్కాయి. వీటిని సక్కర్ ఫిష్ అని అంటారని రాజోలుకు చెందిన మత్స్య శాఖ సహాయ సంచాలకుడు బి. కృష్ణారావు తెలిపారు.
'అక్కడ్నుంచి తరలివచ్చాయి'
వీటి శాస్త్రీయ నామం "హైపోస్థొమస్- ప్లేకొస్థొమస్" అని ఆయన పేర్కొన్నారు. ఇవి ఎక్కువగా బంగ్లాదేశ్లో ఉంటాయన్నారు. పశ్చిమ బంగాకు దగ్గరగా ఉండే ఈ రకం చేపలు, కోల్కతా నుంచి ఆక్వా సీడ్లో కలిసిపోయి ఆంధ్రకి వచ్చాయని వివరించారు. ఈ చేపలు చెరువుల్లో చేరితే ఆక్వా రైతులకు భారీ నష్టం కలుగుతుందని స్పష్టం చేశారు.