ETV Bharat / state

రోడ్డుపైనే మృతదేహం... కన్నెత్తి చూడని జనం - తూర్పుగోదావరి జిల్లా కరోనా వార్తలు

కరోనా భయం మనుషుల్లో మానవత్వాన్ని మాయం చేస్తోంది. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే తత్వాన్ని ప్రజలు కోల్పోతున్నారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో జరిగిన ఘటన ఇందుకు నిదర్శనంగా మారింది.

A barbaric incident took place in Pithapuram

author img

By

Published : Jul 23, 2020, 10:17 AM IST

రోడ్డుపైన ఓ వృద్ధురాలు కుప్పకూలితే కనీసం కన్నెత్తయినా చూడలేదు అక్కడి జనం. ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. కరోనా భయంతో గడప దాటలేదు. ఫలితంగా ఆమె మృతదేహం గంటల తరబడి రోడ్డుపైనే ఉండిపోయింది.

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో అమానుష ఘటన జరిగింది. పట్టణానికి చెందిన నాగమణి స్టువర్ట్​పేటలో అస్వస్థతకు గురై రోడ్డుపైనే కుప్పకూలి మృతి చెందారు. ఇది చూసినప్పటికీ ఏ ఒక్కరూ కరోనా భయంతో దగ్గరకు వెళ్లేందుకు సాహసించలేదు. విషయం తెలుసుకుని అధికారులు వచ్చినప్పటికీ... మృతదేహం వద్దకు వెళ్లలేదు. మృతురాలి వివరాలు సేకరించి.. ఆమె కుమార్తెకు సమాచారం ఇచ్చారు. కుటుంబసభ్యులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు.

ఇదీ చదవండి

గుడ్​న్యూస్​: అక్టోబరు కల్లా ఆక్స్​ఫర్డ్‌ టీకా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.