తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బ్యాంకు ఖాతాదారుల సేవా మహోత్సవాలు నిర్వహించారు. ఆనం కళా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా అనేక బ్యాంకులు పాల్గొన్నాయి. బ్యాంకు సిబ్బంది పలు స్టాళ్లను ఏర్పాటు చేసి ఖాతాదారులకు వివిధ సేవలను అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం బ్యాంకుల వల్ల దేశం ప్రగతి పథంలో నడుస్తోందని ఆంధ్రాబ్యాంకు సర్కిల్ మేనేజర్ నాంచారయ్య అన్నారు. ఖాతాదారులకు అనేక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని వాటిని వినియోగించుకోవాలని సూచించారు. బ్యాంకుల విలీనం విషయంలో తాము చేయగలిగిందేమీ లేదని... ప్రభుత్వం ఏమి చెబితే అది చేస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: