తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం పెద్దశంకర్లపూడి గ్రామంలో నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. 3,400 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసి.. 30 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సిబ్బందిని చూసిన సారా కాసే వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. అక్రమంగా సారా తయారు చేసినా.. అమ్మినా… కఠిన చర్యలు తప్పవని సిఐ వెంకటరమణ హెచ్చరించారు.
ఇదీ చదవండి: 'వరదలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి తక్షణం'