తూర్పు గోదావరి జిల్లా రంపలో ప్రసిద్ధి చెందిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున శివాలయంలో.. మహాశివరాత్రి జాతర ఉత్సవాలకు ఏర్పాట్లు చేశారు. ఈ ఆలయం 12వ శతాబ్దం నాటిదని స్థానికలు తెలిపారు. ఆలయంలో జరిగే ఉత్సవాల కోసం ప్రతి ఏటా ఏజెన్సీ ప్రాంతంతో పాటు.. జిల్లాలో పలు ప్రాంతాల నుంచి వేల సంఖ్యలు భక్తులు హాజరవుతారు.
ఈ ఆలయంలో ఉన్న రాతి సర్పం, శివలింగం, నంది విగ్రహాలను.. దేవతలే ఏర్పాటు చేశారని ప్రతీతి. ఇక్కడి స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలతో పాటు.. సర్ప దోషం పోతుందని భక్తుల విశ్వాసం. ఇక్కడ మూడు రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి.
ఏర్పాట్లు పూర్తి
ఆలయాన్ని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చే భక్తుల దృష్ట్యా.. రంపచోడవరం నుంచి ప్రతి అరగంటకు ఒక ఆర్టీసీ బస్సు నడిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు.. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.
ఇదీ చదవండి: అన్నవరం దేవస్థానం హుండీ లెక్కింపు.. రూ.1.12కోట్లు ఆదాయం