కేంద్ర పాలిత రాష్ట్రం పుదుచ్చేరి అసెంబ్లీకి వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్నాయి. నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని కేంద్రపాలిత ప్రాంతం యానాంలో ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధంమయ్యారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేలా చూసేందుకు ఈ ఎన్నికల్లో ఒక విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు. 'లెట్స్ ఓట్' అంటూ.. సంతకాలు చేసే ప్రచార కార్యక్రమాన్ని యానం ఎన్నికల రిటర్నింగ్ అధికారి అమన్ శర్మ సంతకం చేసి ప్రారంభించారు.
ఎన్నికల సందర్భంగా అనుసరించాల్సిన విధానంపై అధికారులతో చర్చించారు. యానం సరిహద్దుల్లో 10 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి 24 గంటలు వాహన తనిఖీలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు వివరించారు. '50 వేలకు మించి నగదు, అధికమొత్తంలో బంగారం, వెండి, వస్త్రాలు ఇతర గృహోపకరణాల తరలింపను గుర్తిస్తే తక్షణమే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది.. వీధుల్లో ఎక్కడా అలసత్వం వహించొద్దు. పార్టీలు, అభ్యర్థుల తరఫున పక్షపాతంగా వ్యవహరించ వద్దు అని' ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆదేశించారు. మొత్తం 7 సెక్టారుగా విభజించి 28 సిబ్బందిని.. అదనంగా ఫ్లైయింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: పుర పోరు: పుంగనూరు పురపాలికలో వైకాపా ఏకగ్రీవం