ETV Bharat / state

సినీ, టెలివిజన్ కళాకారులు, సాంకేతిక నిపుణుల తయారీకి శిక్షణ - తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఏపీఎఫ్​టీపీసీ సమావేశం

తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో.. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్(ఏపీఎఫ్​టీపీసీ APFPTC) సమావేశం నిర్వహించింది. సినిమా టెలివిజన్ రంగాల్లో.. కళాకారులు, సాంకేతిక నిపుణులను తయారు చేసేందుకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తామని.. ఏపీఎఫ్​టీపీసీ అధ్యక్ష, కార్యదర్శులు తెలిపారు.

apftpc conducted meeting at amalapuram
సినీ, టెలివిజన్ కళాకారులు, సాంకేతిక నిపుణుల తయారీకి శిక్షణ
author img

By

Published : Oct 17, 2021, 3:48 PM IST

తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో.. ఏపీఎఫ్​టీపీసీ (APFPTC) సమావేశం నిర్వహించింది. సినిమా టెలివిజన్ రంగాల్లో, 24 క్రాఫ్ట్ కు సంబంధించిన కళాకారులు, సాంకేతిక నిపుణులను తయారు చేసేందుకు కృషి చేస్తుందని.. ఏపీఎఫ్​టీపీసీ అధ్యక్ష కార్యదర్శులు జంగా చైతన్య, వీ.ఎస్​.వర్మ వెల్లడించారు. ఈ సంస్థకు అనుబంధంగా ఉన్న కల్చరల్ కమిటీతో కలిసి వారు సమావేశమయ్యారు.

కల్చరల్ కమిటీ రాష్ట్ర చైర్మన్ కుంచె వెంకట రమణరావు, బెంగాలి నటి గర్గికుందుతో కలిసి.. పలు విషయాలను చర్చించారు. ప్రతి జిల్లాలోనూ 24 క్రాఫ్ట్స్​కు సంబంధించి.. సినీ, టెలివిజన్ కళాకారులు సాంకేతిక నిపుణులు తయారు చేసేందుకు త్వరలో శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తామన్నారు. కోనసీమ సెలబ్రిటీ పేరిట.. ఈ సంస్థ ద్వారా సినీ అవార్డులు ప్రదానం చేయనున్నట్లు వారు తెలిపారు

ఇదీ చదవండి:

సంజీవయ్య ఇంటిని.. స్మారక చిహ్నంగా మారుస్తాం: పవన్ కల్యాణ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.